ఎస్టియులో సభ్యులుగా చేరండి !సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వండి !
1 min read
రాష్ట్ర కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి
న్యూస్ నేడు,పత్తికొండ: ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూలో సభ్యులుగా చేరాలని ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి ఇట్ రెడ రామ్మోహన్ రెడ్డి కోరారు. సోమవారం పత్తికొండ మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయుల మరియు విద్యాసమస్యలను తెలుసుకుంటూ ఎస్ టి యు ఉపాధ్యాయ బృందం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ,మండల అధ్యక్షుడు ఆవుల నాగరాజు , ప్రధాన కార్యదర్శిమారుతి, ఆర్థిక కార్యదర్శి మండల వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిలర్ బలరాముడు పత్తికొండ మండలం లోనే వివిధ పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకుంటూ 79 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగి శాశ్వత ప్రయోజనా లెన్నో సాధిస్తున్న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టియు)ఆంధ్రప్రదేశ్ .ఎస్టియు సభ్యులుగా చేరండి అని, సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సమరంలోబానిస సంకెళ్లను17 మే 1946న హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ గా ఏర్పడి, సంఘ సమిష్టి కృషితో స్వాతంత్రానికి పూర్వమే నిజాం ప్రభుత్వం చే జూన్ 9 1947న అధికారికి గుర్తింపు పొందిన తొలి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏపీ (ఎస్ టి యు)అని ఆయన తెలిపారు. పోరాటాలకు త్యాగాలకు పుట్టినిల్లు అయిన ఎస్టియు వివిధ యాజమాన్యాలలో, పాలన యంత్రాంగంలో జరిగే అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా సామాజిక ప్రగతి కొరకు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధన కొరకు అనేక ఒంటరి పోరాటాలతో పాటు ఉమ్మడి పోరాటాల వేదికపైన ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక విజయాలు సాధించింది, సాధిస్తూ ముందుకు సాగుదాం.


