వర్షం వచ్చినా ఆగని డోర్ టు డోర్ ప్రచారం
1 min read
– హెబ్బటం గ్రామంలో ఇంటింటికీ చేరిన కూటమి సంక్షేమ సందేశం
హెబ్బటం 56, 57 బూత్‌లలో ఇంటింటి ప్రచారం – ప్రజా సమస్యలు తెలుసుకున్న ఈబీజీ గోవింద్ గౌడ్
హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు.వర్షం కురుస్తున్నప్పటికీ నాయకులు, కార్యకర్తలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా 56, 57 బూత్‌ల పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.4,000 సామాజిక పింఛన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్న క్యాంటీన్లు, విద్య, వైద్యం, రైతు సంక్షేమం తదితర ప్రజాహిత పథకాల గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని స్పందించే ప్రజా ప్రభుత్వం ఇదేనని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడం పట్ల గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను రాబట్టింది.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎస్. పంపపతి, యారిస్వామి, దీడి వెంకటేష్, బాషా, జనసేన మండల కన్వీనర్ అశోక్, బీజేపీ మండల కన్వీనర్ ప్రసాద్, టీడీపీ కో-కన్వీనర్ జకీర్, వీరనాగప్ప, హుస్సేన్ పీరా, రామాంజి, దీడి నాగప్ప, దీడి మల్లయ్య, యువ నాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్, టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షుడు ముల్లా మొయిన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, వెంకటేష్, కో-క్లస్టర్ ఇన్‌చార్జ్ రారవి సిద్ధు, పవన్, 34వ బూత్ ఇన్‌చార్జ్ మల్లయ్య, కానయ్య, ఈబాదుల్లా, జనసేన నాయకుడు వెంకటేష్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



