” జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి “
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: జి. కబర్ది, కర్నూలు ప్రధాన జిల్లా న్యాయమూర్తి & చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 11-08-2026 వ తేదిన జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి జిల్లా కారాగారము తనిఖీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా జడ్జి జైలు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను మరియు ములాకత్ ఏరియా లో గల హెల్ప్ డెస్క్ ను తనిఖీ చేసి “జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్” గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్ ఒక ప్యారా లీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని కోరారు. ఖైధి లకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. 70 ఏళ్ళు వయస్సు పై బడిన ఖైధిలకు, అనారోగ్యంతో బాధ పడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తా మని త్యరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఖైధి లకు అందించే ఆహారాన్ని, రేషన్ ను వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైధి లను కోర్ట్ వాయిదా లకు కచ్చితంగా హాజరు చెయ్యాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించవచ్చును అన్నారు, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివ రామ చంద్ర రావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఏ. సులోచన, ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయ వాది చిన్న రాందాస్, పారా లీగల్ వాలంటీర్ హేమంత్, శివాని మరియు హెల్ప్ డెస్క్ న్యాయ వాదులు బి.లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ రెడ్డి, రామపుల్లయ్య, పారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.


