NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూటాన్ టోర్నీకి ఎంపికైన జగదీశ్వరిని అభినందించిన కాటసాని రామభూపాల్ రెడ్డి

1 min read

పాణ్యం , న్యూస్​ నేడు: గడివేముల మండలం, పెసరవాయి గ్రామానికి చెందిన చిందుకూరు నాగేశ్వరరావు  కుమార్తె జగదీశ్వరి అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టు తరఫున ఎంపిక కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి  హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జగదీశ్వరి క్రీడారంగంలో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, పాణ్యం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ రూ.25,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రోత్సహించారు.కాగా, భూటాన్‌లో ఆగస్టు 24 నుంచి 27 వరకు జరిగే అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున జగదీశ్వరి పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల నాయకులు ఎల్లారెడ్డి , మంచాలకట్ట అనిల్ కుమార్ రెడ్డి , సర్వేశ్వర రెడ్డి , బోయ కాంత్ గారు, నాగేశ్వరరావు , వెంకటేశ్వర రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *