క్రైస్తవుల అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తా
1 min read
చర్చి నిర్మాణానికి రూ 20వేల ఆర్థిక సాయం చేసిన జక్కయ్య
మంత్రాలయం న్యూస్ నేడు : గ్రామాల్లో ఉన్న క్రైస్తవుల అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని వైకాపా నాయకులు బూదూరు జక్కయ్య అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్మిస్తున్న క్రీస్తు సంఘం చర్చి నిర్మాణానికి రూ. 20 వేల రూపాయలు ఆర్థిక సాయం జక్కయ్య అందించారు. ఈ ఆర్థిక సాయం ఆయన మంత్రాలయం మండలం బూదురు గ్రామంలోని తన స్వగృహం నందు పాస్టర్ ప్రసాద్ సంఘ పెద్దలు ప్రకాశం ఈరన్న గోపాల్ చిన్న పెద్ది గిడ్డయ్య జగదీష్ లకు అందజేశారు.ఈ సందర్భంగా సంఘ పెద్దలు జక్కయ్యను శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. అలాగే కృతజ్ఞతలు తెలిపారు.


