‘ కిక్ బాక్సింగ్ ’ లో కర్నూలు క్రీడాకారుల ప్రతిభ
1 min read
అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన త్రినాథ్ అకాడమీ క్రీడాకారులు
- బంగారు, వెండి, సిల్వర్ పతకాలు కైవసం
- విజేతలను అభినందించిన త్రినాథ్ అకాడమీ చైర్మన్ డా.త్రినాథ్
కర్నూలు, న్యూస్ నేడు :కిక్ బాక్సింగ్ క్రీడలో కర్నూలు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జాదవ్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో కర్నూలు త్రినాథ్ అకాడమీ క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. కర్నూలుకి సంబంధించిన కిక్ బాక్సింగ్ క్రీడాకారులు కు బంగారు, వెండి పతకాలు కైవసం చేసుకున్నారు. కిక్ లైట్ ప్లస్ 69 కేజీల విభాగంలో రామ్చరణ్కు బంగారు పతకం సాధించగా… టీత్ గణపతి దేవ్జి మైనస్ 69 కేజీల కిక్ లైట్ విభాగంలో సిల్వర్ , పాయింట్ ఫైవ్ మైనస్ 69 కేజీల విభాగంలో కాంస్య , గుర్రం హరి కళ్యాణ్ రింగ్ ఫైట్ లోకి కిక్ విభాగంలో మైనస్ 75 కేజీల విభాగంలో కాంస్య , లౌకిక ఈవెంట్లో జై కళ్యాణ్ మైనస్ 67 కేజీల విభాగంలో సిల్వర్ పతకం సాధించారు.
విజేతలకు అభినందన: డా. త్రినాథ్
కిక్ బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులను త్రినాథ్ అకాడమీ చైర్మన్ డా. త్రినాథ్ అభినందించారు. బుధవారం అమ్మ హాస్పిటల్ అధినేత డా.త్రినాథ్ ను కలిసిన క్రీడాకారులను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అనంతరం డా. త్రినాథ్ మీడయాతో మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ క్రీడలో రాణిస్తున్న క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉంటారని, చదువులోనూ రాణిస్తారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కిక్ బాక్సింగ్ క్రీడపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చన్నారు. కర్నూలు నగరంలోని డా. త్రినాథ్ అకాడమీలో కోచ్ నరేంద్ర ఆచార్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇచ్చిన కోచ్ నరేంద్ర ఆచార్య ను కూడా ఈ సందర్భంగా డా.త్రినాథ్ అభినందించారు.



