NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి  105వ జయంతి వేడుకలు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానేత, కీర్తిశేషులు  కోట్ల విజయభాస్కర్ రెడ్డి  105వ జయంతి సందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి  విగ్రహానికి పూలదండలు వేస్తూ నివాళులు అర్పించిన టిడిపి నాయకులు అలాగే మండల కూటమి నాయకులు మాట్లాడుతూ  కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రజల మనసుల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. ప్రజాసేవే పరమోన్నత ధర్మమని ఆయన చూపించిన మార్గదర్శక సూత్రాలు, నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రజల పట్ల ఆయన చూపిన అంకితభావం ఎప్పటికీ ఆదర్శంగా ఉంటుంది ,అని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఖాజా ఫీర్ , రాజా  నారాయణమూర్తి ,దానం మధు,చల్లా వీరాంజనేయులు, మెట్టుపల్లి సుదర్శన్, ప్రసాద్ రెడ్డి , రామ్మోహన్ యాదవ్ ,గండికోట రామాంజనేయులు, ఎస్ కే వలి,  ప్రతాప్ రెడ్డి , వెంకటేష్ , సయ్యద్ అక్బర్ వలి, డిష్ శ్రీను, జనసేన చంద్ర, చట్నీ పల్లె దాసు , పచ్చ చంద్రశేఖర్ , దూదేకుల రఫీ  తదితరులుపాల్గొన్నారు.

About Author