NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాజెక్టులను పరిశీలించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ చైర్మన్

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలో బానకచర్ల మరియు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లను(కెఆర్ఎంబి) కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్  సభ్యులతో కలిసి బుధవారం ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రాజెక్టుల యొక్క విశిష్టత, నీటి లభ్యత,దిగువకు నీటి విడుదల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఎస్ఈ శివ శంకర్ రెడ్డి, డిఈలు సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేష్,ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,ఇన్చార్జి ఎస్సై మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

About Author