పట్టణంలో శాంతిభద్రతలే ముఖ్యం
1 min read

బాధ్యతలు చేపట్టిన పట్టణ సీఐ అశోక్ కుమార్..
నందికొట్కూరు న్యూస్ నేడు: పట్టణంలో శాంతిభద్రతలే ముఖ్యమని నందికొట్కూరు పట్టణ నూతన సీఐ ఎం అశోక్ కుమార్ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ సీఐగా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.కౌతాళంలో సీఐగా పని చేస్తూ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చారు.2004 ఎస్సై బ్యాచ్ కు చెందిన ఈయన ఉమ్మడి జిల్లాలో హాలహర్వి,కర్నూలు రైల్వే,సిసిఎస్ తదితర చోట్ల విధులు నిర్వర్తించినట్లు నూతన సీఐ తెలిపారు. ఇక్కడున్న సీఐ వై ప్రవీణ్ కుమార్ రెడ్డి కర్నూలు సోషల్ మీడియా సైబర్ క్రైమ్ సెల్ సీఐగా వెళ్లిన సంగతి తెలిసిందే.2024 సెప్టెంబర్ లో బాధ్యతలు చేపట్టిన సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పట్టణంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు ఎంతగానో కృషి చేశారు. ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ ను బుధవారం మధ్యాహ్నం ఆత్మకూరులో నూతన సీఐ మర్యాదపూర్వకంగా కలిశారు.

