NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వడ్లమాను పంచాయితీ పరిధిలో సీ సీ రోడ్లు వేయండి 

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  ఆగిరిపల్లి పంచాయతీ పరిధిలో మరియు వడ్లమాను పంచాయతీ పరిధిలో ఉన్న సిసి రోడ్లు వేయాలని ఒక ప్రకటన ద్వారా  .హోమన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్  నానయ్య పంతగాని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు 40 ఏళ్లగా కొండ కాలనీవాసులు బడుగు బలహీన వర్గాల ప్రజలుఇక్కడ నివాసం ఉంటున్నారని ,వడ్లమాను   పంచాయతి పరిధిలో ఉన్న రోడ్లు సక్రమంగా లేవని వర్షం పడితే చిత్తడిగా మారి స్కూల్ పిల్లలు, వృద్దులు, వాహనదారులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గతంలో ఆ ప్రభుత్వం విన్నవించగా78 లక్షలు ఈ రోడ్లకు శాంక్షన్ చేశారని, ప్రభుత్వం మారడంతో  రోడ్లు వేయడం  జరగలేదని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిందని మంత్రివర్యులు, శాసనసభ్యులు కొలుసు పార్థసారధి కి ప్రజా దర్బార్లో ‌ విన్నవించగా 49 లక్షలు మంజూరు చేశారని , తెలియజేశారు. ఇది కూడా మా రోడ్లు వేయటానికి కాకుండా  వడ్లమాను  పంచాయతీలో వేరే రోడ్లు వేస్తారని తెలిసిందన్నారు. ఇప్పటికైనా ఆగిరిపల్లి కొండ కాలనీ రోడ్లు సిసి రోడ్లు వేసి కొండ కాలనీ వాసులు  ఇబ్బందులు లేకుండా చేస్తారని కోరుకుంటూ ఒక ప్రకటన ద్వారా ఆయన తెలియజేశారు.

About Author