అధికారదుర్వినియోగం కీ పాల్పడుతున్నా ఎమ్ఈఓ -1 ని సస్పెండ్ చేయాలి
1 min read

ఎమ్ఆర్సి కార్యాలయం ఎదుట ఎమ్ ఈ ఓ దిష్టి బొమ్మ దహనం చేసిన ఆర్ యు ఎస్ ఎఫ్ , ఆర్ పి ఎస్ ఎఫ్ సంఘం నాయకులు
ఎమ్మిగనూరు న్యూస్ న్యూస్ నేడు: మంత్రాలయం మండలం లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలాకుతున్న ఎమ్ఈఓ -1 ని విధులు నుంచి తొలగించాలి అని ఆర్ యూ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్, ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది లు స్థానిక ఎమ్ఆర్సి కార్యాలయం ఎదుట ఎమ్ఈఓ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం మండలం లో ఉన్న జీనియస్ గ్లోబల్ స్కూల్ లో ప్రభుత్వం నిబంధనలు వ్యతిరేకంగా నవోదయ, గురుకుల, సైనిక్ కోచింగ్ సెంటర్ మరియు హాస్టల్ ఏర్పాటు చేశారు, అలాగే ఈ కోచింగ్ సెంటర్ పేరిట తల్లితండ్రులు నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు మరియు స్లెట్ స్కూల్ ఫిజుల పట్టిక లో ఒకరకంగా మరియు తల్లితండ్రులు నుంచి అధిక మొత్తంలో ఫిజులు వసూలు చేస్తున్నారు విద్యార్థులను బస్సులు వ్యాన్లు లో పరిమితికి మించి విద్యార్థులు ఎక్కించుకోవడం జరుగుతుంది విద్యార్థులకు జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని వారు ప్రశ్నించారు.అదేవిధంగా ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా పుస్తకాల యూనిఫామ్ కొత్త యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి అధిక మొత్తంలో వసూలు చేయడం దారుణమని విద్యార్థుల పట్ల ఎలాంటి శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా జిల్లా విద్యాధికారులు గమనించి ఎంఈఓ ని తొలగించి విద్యార్థులు జీవితాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారి తీస్తామని వారు హెచ్చరించారు.

