సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు టీడీపీ అధిష్టానం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ను అందరూ కలసి కట్టుగా వేగవంతం చేసి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆలూరు టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ కోరారు.శనివారం ఆలూరు టిడిపి కార్యాలయం లో నిర్వహించిన విలేఖర్ల. సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కార్యక్రమం ను చురుకుగా నిర్వహించిన ప్రతి మండల కన్వీనర్, క్లస్టర్ ఇంచార్జి,బూత్ ఇంచార్జీ లను ఆయన అభినందించారు.ఇదే ఉత్సాహం తో మరో నాలుగు రోజులు కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి సుపరిపాలన లో ముందడుగు కార్యక్రమాన్ని నిర్వహించి లక్ష్యని పూర్తి చేసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ల కు మంచి పేరు తీసుకురావాలన్నారు.

