ఉర్దూ యూనివర్సిటీలో ఘనంగా డా. బి .ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు లోని డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ యొక్క 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా అంబేద్కర్ గారి చిత్రపటంకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. లోకానాథ్ గారు మరియు బోధనా సిబ్బంది పులమాలతో నివాళి అర్పించారు. ఈయొక్క కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డా. చంద్రయ్య గోపాని అలహాబాద్ యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ ద్వారా సందేశమును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా. బి ఆర్ అంబేద్కర్ భారత ప్రజలకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆయన యొక్క సేవలను కొనియాడారు. రాజ్యాంగం మనల్ని ఒక మానవునిగా గుర్తించింది మరియు కుల పాలన వ్యవస్త నుండి చట్ట పాలన వ్యవస్థలోకి తీసుకువచ్చింది. అలాగే సమాజంలో సగర్వంగా జీవించేందుకు మరియు రాజకీయంగా పాలన చేయటానికి ప్రజలకు ప్రాతినిధ్యపు హక్కును ఇచ్చింది అంతేకాక చివరిగా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఓటు హక్కును భారత ప్రజలకు కలుగచేసి ఉన్నత పౌరులుగా చేసింది అని చెప్పారు. ఈయొక్క కార్యక్రమమునకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రో. షావలి ఖాన్ మరియు రిజిస్ట్రార్. ప్రో. లోకనాథ్ అలాగే యూనివర్సిటీ బోధన సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జారి చేయు వారు. రిజిస్ట్రార్ డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ. కర్నూలు.

