శ్రీరాముడు భారతీయుల గుండె చప్పుడు
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే
నందికొట్కూరులో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడు భారతీయుల గుండె చప్పుడని, రాముని పాత్ర మానవ సమాజ మనుగడకు దిక్సూచి అని, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సి. హెచ్.వి. రాజారెడ్డి శ్రీమద్రామాయణంపై ప్రవచించారు. మల్యాల భజన మండలి వెంకట రమణ ఆధ్వర్యంలో చేసిన భజన కార్యక్రమం జనరంజకంగా సాగినది. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారమండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బి.వెంకోజి రావు, కోశాధికారి ఏం సత్యనారాయణ రావు, అర్చకులు శ్రీధర్, జి వెంకట రమణయ్య, జి సరోజ, యం. జయగౌరి, జి కృష్ణారావు, భవాని కుమార్, పి.సాయి దీప, జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

