మహిళలు అభివృద్ధికి సారథులు…
1 min read

ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ
చాగలమర్రి న్యూస్ నేడు : మహిళలు కేవలం పథకాల లబ్ధిదారులే కాదు అభివృద్ధికి సారథులు అని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళల విజయాలనే కాదు, సడలని సంకల్పాన్ని కూడా చాటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చట్టసభలు ఎన్ని చట్టాలు తెచ్చినా కాగితాలకే పరిమితం అవుతున్నాయని అమలు చేయాల్సి ఉందని ఆమె అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం చేస్తూ వారి ప్రతిభకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన వారే అనగద్రొక్కుతున్నారని పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించాలని కోరుతూ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో, తరగతి గదులలో, వంటింట్లో, సమాజంలో మూల స్తంభాలుగా నిలిచి అద్భుతమైన ధర సాహసాలు ప్రదర్శించి ఎన్నో విజయాలను కైవసం చేసుకున్న ఘనత మహిళలదే అన్నారు. పెద్దలకడనే నిద్రలేచి, రాత్రి నిద్రపోయే వరకు యంత్రంలా పనిచేసిన గుర్తింపు లేదన్నారు. వారి మొనగాడు చూస్తే వారి శ్రమకు వెలకట్టలేమన్నారు. సంరక్షణ సేవలో అంగన్వాడీ కార్యకర్తలుగా, ఆరోగ్య విషయాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న ఆశా కార్యకర్తలుగా, వివిధ కార్యాలయాల్లో వారి కృషి అమోఘం అన్నారు. సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో రక్షణ, ఆరోగ్యం, ప్రత్యేక చట్టాలు తెచ్చి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుటకు పాలకులు చట్టసభల్లో ప్రత్యేక బిల్లులు ప్రవేశపెట్టాలన్నారు. పనికి తగ్గ వేతనాలు కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

