NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీరాముడి ఔదార్యం యావత్ ప్రపంచానికి ఆదర్శం

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

తూడిచెర్లలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీరాముడి ఔదార్యం యావత్ప్రపంచానికి ఆదర్శమని, శ్రీరాముడు చూపించిన కరుణ, దాతృత్వం, క్షమాగుణం, అసూయ లేనితనం, సకల ప్రాణుల హితాన్నికోరే గుణం, మానవులపైనే కాక పశుపక్షాదులపై దయ కలిగి ఉండడం, ఇతరులు చేసిన ఉపకారాన్ని గుర్తించడం మొదలైన గుణాలు మానవజాతి మనుగడకు అవసరమైన గుణాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా మండలం, తూడిచెర్ల గ్రామంలోని శ్రీ రామాలయం నందు ఐదు రోజుల ధార్మిక కార్యక్రమాలను వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు ప్రారంభో ఉపన్యాసం చేశారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, ధర్మప్రచారకులు జయదేవానంద స్వామి శ్రీమద్రామాయణంపై చేసిన ధార్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో అలరించినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండు బాల మద్దిలేటి, పారిశ్రమికవేత్త బి.పద్మనాభయ్య, తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు పి. రామచంద్రుడు, డి. సుధాకర్,  ఎన్. రాముడు, బాలకృష్ణ, ఉప సర్పంచ్ కె.చెన్నారెడ్డి, కెగోపాల్ రెడ్డి, డి. చిన్న నరసిహులు, కుమ్మరి మధుతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమావాస్య కావడం వల్ల భక్తాదులందరికి భక్ష భోజనాలు ఏర్పాటు చేశారు.

About Author