NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

1 min read

పోలీసు సేవలు సమాజానికి ఆదర్శం

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు : పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల రక్షణ కోసం త్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం (బొమ్మలసత్రం)లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు తదితరులు హాజరయ్యారు. ముందుగా పెరేడ్ కమాండర్ జి. బాబు వద్ద నుండి జిల్లా కలెక్టర్, ఎస్పీ వందనం స్వీకరించారు. అనంతరం ఏఆర్​   శ్రీనివాసరావు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల వివరాలను అందరికీ తెలియజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసి, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని, పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.వారి కుటుంబ సభ్యులను సన్మానించడం అత్యంత గర్వించదగ్గ విషయమన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా ప్రజల రక్షణ కోసం పోరాడతారో, సమాజంలో చట్ట-వ్యవస్థ పరిరక్షణలో పోలీసుల పాత్ర కూడా అంతే గొప్పదని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన నేపథ్యంలో పోలీసు విధులలో ఒత్తిడి ఎక్కువవుతున్నా, పోలీసులు సమాజ శాంతి-భద్రతల పరిరక్షణలో అచంచలంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

About Author