NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను సందర్శించిన ఎం.ఏ. షరీఫ్  

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలులోని ఏపీ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ప్రభుత్వ సలహాదారు శ్రీ ఎం.ఏ. షరీఫ్  సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా, వసతి మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో  టీడీపీ పార్టీ మైనారిటీ జనరల్ సెక్రటరీ న  శ్రీ బషీర్ అహ్మద్  మరియు నంద్యాల మైనారిటీ నాయకులు  మహమ్మద్ గౌస్ ఇతర ప్రముఖులు  హాజరయ్యారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ ఎం.ఏ. షరీఫ్  పేర్కొన్నారు. మైనారిటీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం మరియు భవిష్యత్ అవసరాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు సిబ్బందితో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *