ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూల్ నగర అధ్యక్షులుగా ఎం.రామకృష్ణ …
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూల్ నగర యూనిట్నకు ఖాళీ అయిన అధ్యక్షులు స్థానమునకు కో-ఆప్షన్ నిర్వహించుటకు రాష్ట్ర సంఘం ప్రతినిధులుగా,పరిశీలకులుగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వి దస్తగిరి రెడ్డి మరియు కడప జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కర్నూలు ఎన్జీవో హోం నందు జరుపబడినది. నగర అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు సభ అధ్యక్ష స్థానం వహించిరి.ఈ కార్యక్రమం రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించడం జరిగినది. ఈ ఎన్నికలలో కర్నూల్ నగర అధ్యక్షులుగా ప్రస్తుత నగర కార్యదర్శి ఎం రామకృష్ణ నగర అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగినది. మరియు ఖాళీ అయిన నగర కార్యదర్శి స్థానంలో ఎస్ .సాయి రామ్ ఎన్నిక కావడం జరిగినది. మరియు ఖాళీగా అయినటువంటి ఉపాధ్యక్షుడు స్థానంలో జనార్దన్ రెడ్డి ఎన్నికవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా కర్నూలు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వీ జవహర్లాల్ మరియు జిల్లా కార్యదర్శి ఎం. సి. కాశన్న, కడప జిల్లా కార్యదర్శి నిత్య పూజయ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఈశ్వరయ్య నంద్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మరియు పత్తికొండ తాలూకా అధ్యక్షులు సాయిబాబా కోడుమూరు తాలూకా అధ్యక్షులు శ్రీనివాసులు కార్యదర్శి చంద్రశేఖర్, ఆలూరు తాలూకా అధ్యక్షులు మోహన్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు నగర కార్యవర్గ సభ్యులు మరియు బిసి వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రాజు మరియు ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు నరసింహులు,కార్యదర్శి సంపత్ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రవికుమార్, మరియు ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నూతన నగర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జిల్లా , రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు సంఘము అభివృద్ధికి తోడ్పడుతామని ఉద్యోగులకు సంబంధించినటువంటి 21 వేల కోట్లు బకాయిలు విడుదల చేయించినందుకు రాష్ట్ర సంఘం పెద్దాయన కామ్రేడ్ విద్యాసాగర్ కి ఉద్యోగుల రుణపడి ఉంటామని మరియు రాబోయే కాలంలో జిల్లా రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ ఎన్నిక సందర్భంగా మాట్లాడడం జరిగినది.ఈ ఎన్నిక కార్యక్రమం సజావుగా జరిపించినందుకు రాష్ట్ర సంఘం అధ్యక్షులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ కి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి కి మరియు కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు కి కర్నూల్ నగర సంఘ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు..అంతేకాకుండా కర్నూలు నగర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలోనే మాకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము.


