NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మద్దూరు సుబ్బారెడ్డి

1 min read

ఘనంగా సుబ్బారెడ్డి జయంతి వేడుకలు

హాజరైన ఎమ్మెల్యే జయసూర్య..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  ప్రజల కోసం అనునిత్యం పాటుపడే ఏకైక వ్యక్తి కీ.శే. నంద్యాల మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 113వ మద్దూరు సుబ్బారెడ్డి జయంతి మరియు 64వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా మద్దూరు సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల ఎంపీగా సుబ్బారెడ్డి హయంలో ఎంతో అభివృద్ధి చేశారని అంతేకాకుండా రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.అయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనిఅధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పాటుపడే ఏకైక వ్యక్తి మరియు ప్రజాభిమానాన్ని సంపాదించిన వ్యక్తి నిజాయితీ నిబద్ధతకు మారు పేరు సుబ్బారెడ్డి అని ఆయన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.ఆటోల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే మరియు మద్దూరు సుబ్బారెడ్డి మనవడు సహకార సొసైటీ చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు.వచ్చే సంవత్సరం వేడుకలకు ఆటల పోటీల్లో ప్రతిభ కనబరచిన బాలికలకు 3వేలు,బాలురకు 2 వేలు నేను ఇస్తానని ఎమ్మెల్యే పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరం.ప్రసాద్ రెడ్డి,కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,సర్పంచ్ మరియమ్మ,మాజీ ఎంపిటీసీ ఖాజా మొహిద్దీన్,ఖాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,కలీలుల్లా బేగ్, జనసేన రామిరెడ్డి,పాఠశాల చైర్మన్ పుల్లన్న, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.

About Author