NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధిత దళిత కుటుంబాలకు న్యాయం అందెలా కృషి

1 min read

హోళగుందన్యూస్ నేడు: జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలుహొళగుందలో దళిత సంఘాల నాయకుల తో మాట్లాడుతున్న జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు గొండివల్లె మాలతిహోళగుంద ఇతర వర్గాల నుంచి బాదింపబడ్డ దళిత కుటుంబాలకు న్యాయం జరిగెలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు గొండివల్లె మాలతి అన్నారు. శనివారం ఆమె మండలంలో పర్యాటించారు. 2022లో కోగిలతోటలో హత్యకు గురైన దళిత వర్గానికి చెందిన హనుమంతప్ప కుటుంభానికి నేటి వరకు రెవెన్యూ అధికారులు పరిహారాలు, ఇతర పనులు చెయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని నమస్య పరిష్కారానికి వచ్చినట్లు ఆమె విలేకరులకు తెలిపారు. ఈ మేరకు తహసీల్దారు నిజాముద్దీన్తో మాట్లాడి బాధితులకు సత్వర్యమే న్యాయం జరిగెలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు దళిత నాయకులు తెలిపారు. ఈ మేరకు ఇక్కడ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర విషయాలను ఎమ్మార్పీఎస్ మండలధ్యక్షుడు గజ్జెళ్లి కెంచప్ప, ఎంపీటీసీ మల్లికార్జున, నాయకులు వెంకటేష్, దేవప్ప, చిదానంద, వీరేశ్, గోవర్ధన, రమేశ్, వల్లి ఈరన్న తదితరులు ఆమెకు వివరించారు.. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి చర్యలు తీసుకుంటానని ఆమె హమినిచ్చారు.

About Author