NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళపై బలత్కారం..వ్యక్తి అరెస్ట్ రిమాండ్

1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు:  మహిళపై బలత్కారం చేసిన కేసులో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేసష్  తెలిపారు.మంగళవారం సాయంత్రంఎస్సై తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో ఈనెల 5వ తేదీ రాత్రి 10 గంటల సమయం లో నాగలూటి గ్రామానికి చెందిన వడ్డే దండుగుల లక్ష్మీ దేవి(40) భర్త లేట్ రామకృష్ణలక్ష్మీదేవి ఇంట్లో నిద్రిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన వడ్డే ఈశ్వరయ్య కుమారుడు మంజుల దస్తగిరి అనే వ్యక్తి లక్ష్మీదేవి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి లక్ష్మీదేవిని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.అందుకు ఆమె సహకరించక పోవడంతో దస్తగిరి లక్ష్మీదేవి ముఖం మీద కొట్టడంతో లక్ష్మీదేవి నోటిలో కింది భాగంలో ఉన్న పండు ఊడిపోయినందున లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై కేసు నమోదు చేశారు.మంగళవారం మధ్యాహ్నం నాగలూటి క్యాంప్ దగ్గర ఉన్న వడ్డే దస్తగిరిని అరెస్టు చేసి నందికొట్కూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో సుందరాజు,కానిస్టేబుల్ రేణు ప్రసాద్ పాల్గొన్నారు.

About Author