NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలి

1 min read

యువతకు 5 సం”లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

జాబ్ మేళా లో పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రోసెసింగ్ శాఖ మంత్రి టి జి భరత్ గుప్త

కర్నూలు , న్యూస్​ నేడు : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని తద్వారా అనుభవం సాధించి భవిష్యత్తు లో మంచి అభివృద్ధి సాధించాలని కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ జాబ్ మేళా సమావేశంలో యువతను ఉద్దేశించి  పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రోసెసింగ్ శాఖ మంత్రి టి జి భరత్ గుప్త పేర్కొన్నారు. శనివారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి విభాగం మరియు శిక్షణ సంస్థ కర్నూలు  క్లస్టర్ యూనివర్సిటీ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన 4 వ మెగా జాబ్ మేళా ను  పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రోసెసింగ్ శాఖ మంత్రి టి జి భరత్ గుప్త ప్రారంభించి యువతను ఉద్దేశించి  ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కర్నూలులో ఇప్పటివరకు మూడు మెగా జాబ్ మేళాలు నిర్వహించామని అందులో కేవలం 50 శాతం ఉద్యోగాలు మాత్రమే యువత సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. దీనికి కారణం యువతలో నైపుణ్యం లేకపోవడం లేదా ఉద్యోగం వచ్చిన చేరకుండా ఉండొచ్చని అన్నారు.  ఈరోజు 19 కంపెనీలు  దాదాపు 1500 ఉద్యోగాలు  యువతకు ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చాయని ఇందులో మీ ప్రతిభను చూపెట్టి ఉద్యోగాలు సాధించాలని , వచ్చిన ఉద్యోగంలో వెంటనే చేరిపోయి కొన్ని సంవత్సరాలు పాటు పని చేసి అనుభవం గడించాలని ఆ తరువాత మీకు ఏ విధంగా అభివృద్ధి చెందాలో పూర్తి అవగాహన వస్తుందని కావున ఇప్పుడు ఉన్న అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందించాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తూ ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా పోటీ పడవలసిన అవసరం ఏర్పడిందని తెలిపారు. యువత వారి వారి రంగాలలో నైపుణ్యం సాధించి ఉండడం చాలా అవసరమని మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో రిలయన్స్ , అగస్తా , గ్రీన్ హైడ్రోజన్ , సోలార్ , విండ్ పవర్ ఉత్పత్తి లాంటి చాలా పెద్ద కంపెనీలు పనులు మొదలుపెట్టాయని జయరాజ్ ఇస్పాత్ విస్తరణ జరుగుతూ ఉందని మరియు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎం ఎస్ ఎం ఈ లు ఏర్పాటు చేస్తున్నామని వాటి ద్వారా ఉద్యోగాలు వస్తాయని అందుకు యువత ఆ కంపెనీలలో పనిచేయడానికి అవసరమైన అనుభవంతో సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో ఆంధ్రప్రదేశ్ లోనే వస్తున్నాయని తెలిపారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని తెలిపారు.క్లస్టర్ యూనివర్సిటీ అధికారుల కోరిక మేరకు యూనివర్సిటీ  ప్రాంగణంలో మినరల్ వాటర్ ప్లాంట్ మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి  విడతల వారీగా సహకరిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావు మాట్లాడుతూ… గత ప్రభుత్వం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఏర్పాటు కాబడిన  ఈ యూనివర్సిటీ ద్వారా మంచి విద్యను అందిస్తున్నామని మరియు పరిశోధనలకు సహకరిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంగణంలో 19 సంస్థలతో  4వ జాబ్ మేళాను దూర దృష్టిగల మంత్రి భరత్  నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి  సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు శెట్టి , డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనందరాజ కుమార్, రిజిస్ట్రార్ శ్రీనివాసులు యువత అభివృద్ధి చెందడానికి  పలు సూచనలు తెలియజేశారు. అడ్మినిస్ట్రేటర్ అక్తర్ భాను , సమావేశము లో పాల్గొన్నారు.

About Author