NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురం గ్రామంలో  ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చ బండ కార్యక్రమం నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కూటమి ప్రభుత్వం పై విసుగు చెంది టీడీపీ పార్టీ నుండి వైస్సార్సీపీ పార్టీ లోకి 10 కుటుంబలు చేరడం జరిగింది.., టీడీపీ పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన వారికీ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గారు  కండువ కప్పి వైసీపీ పార్టీ లోకి ఆహ్వానించారు .ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ….వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో  పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని పేదలకు వైద్యం ఖరీదు అయిపోతుందని అన్నారు_. గత ప్రభుత్వములో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీ లను తీసుకువస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని  ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. పేద ప్రజలకు ఉచితముగా వైద్యం అందించాలని లక్ష్యంతో ఆనాడు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే నేడు అనారోగ్య శ్రీ గా మార్చేసి ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా పేదలకు వైద్యం దూరం చేస్తున్నారని అన్నారు .ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author