ఏపీ ఎన్జీ జివోస్ జిల్లా ఉపాధ్యక్షురాలు గా మార్లపూడి లీలారాణి ఏకగ్రీవ ఎన్నిక
1 min read

ఘనంగా సత్కరించి సన్మానించిన సహద్యోగులు,బంధుమిత్రులు శ్రేయోభిలాషులు
ఈ పదవి కి సమర్థవంతంగా పనిచేసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీ జీవో జిల్లా ఎన్నికలు స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ డీసీఎంఎస్ గ్రాండ్ కన్వెన్షన్ ఏ/సి హాల్లో అత్యంత వైభవంగా నాయకులు నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరు సిహెచ్ సి లో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న మార్లపూడి లీలరాణి ఏపీ ఎన్జీ జీవో సంఘ ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈమెకు తోటి సహ ఉద్యోగులు,మిత్రులు శ్రేయోభిలాషులు,కుటుంబ సభ్యులు శాలువాలు కప్పి పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో గౌరవంతో నాకు ఈ పదవి అప్పగించిన జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్ కి నెరుసు శ్రీనివాస్ కి నాతోటి ఎన్నికైన ఏపీ ఎన్జీ జీవోస్ అసోసియేషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఈ పదవికి నన్ను ఎంపిక చేసిన నాతోటి ఉద్యోగుల కోసం సమర్థవంతంగా పని చేసి సంఘానికి మంచి పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

