మెడికవర్ ‘ ISO నాణ్యత ప్రమాణ సర్టిఫికెట్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు నాణ్యత నిర్వహణ వ్యవస్థ (Quality Management System)లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను 2025–2026 సంవత్సరాల కోసం ISO సర్టిఫికెట్ను పొందింది. ఇది ఆసుపత్రి వైద్య సేవల నాణ్యతకు మరో గుర్తింపుగా నిలిచింది.ఈ ISO నాణ్యత ప్రమాణ సర్టిఫికెట్‌ను మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేషెంట్ లకు సురక్షితమైన, నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన వైద్య సేవలు అందించడమే మెడికవర్ లక్ష్యమని తెలిపారు.ఆసుపత్రిలో ప్రతి విభాగంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం, నిరంతర పర్యవేక్షణ, రోగి భద్రత, సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఇది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది సమిష్టి కృషికి ఫలితమని అన్నారు.ఈ ISO సర్టిఫికేషన్ ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ ప్రజలకు మరింత విశ్వసనీయమైన, ప్రమాణబద్ధమైన ఆరోగ్య సేవలు అందించగలదని, భవిష్యత్తులో కూడా నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా సేవలను కొనసాగిస్తామని క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

