NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెగా ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  హతాత్మ దివాస్ నీ పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ – బజరంగ్దళ్ ఆధ్వర్యంలో అమీలియా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ.తాండ్రపాడు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మెగా ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గ్రామస్తులు చాలామంది పాల్గొని వారికి సంబంధించిన వ్యాధులకు ఉచిత పరీక్షలు మరియు మందులు పొందారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి , కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరాజులు , కర్నూలు జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు , కర్నూలు జిల్లా సమరతాసత ప్రముఖ్ నవీన్ కర్నూలు జిల్లా బజరంగ్దళ్ సహ సంయోజన తేజ, కర్నూలు జిల్లా గోరక్ష ప్రముఖ మరియు కర్నూల్ గ్రామీణ ప్రఖండ ప్రబారి బెస్త పరశురాముడు, కర్నూల్ గ్రామీణ ప్రఖండ కార్యదర్శి శ్రీరాములు కర్నూలు, గ్రామీణ ప్రఖండ బజరంగ్దళ్ సంయోజక్ సోమనాథ్, గ్రామీణ సేవా  ప్రముఖ్ సాయికిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమీలియా హాస్పిటల్ సిబ్బందితో కలిసి శ్రీరాములు, బెస్త పరశురాముడు, సోమనాథ్, సాయికిరణ్, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే శ్రీశ్రీశ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయంలో గత 25 సంవత్సరాలుగా నిర్విరామంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క కృపతో భక్తాదుల సహాయ సహకారాలచే కార్తీక పౌర్ణమి (103 లో పౌర్ణమి) కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈ సంవత్సరం కూడా గాయత్రీ యజ్ఞము అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రం తో కుంకుమార్చన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నవి మధ్యాహ్నం మహానప్రసాదం వితరణ జరిగింది.అలాగే సాయంకాలం దీపోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. ఈ.తాండ్రపాడు గ్రామం, కర్నూలు జిల్లా.

About Author