ఉర్దూ స్కూల్ లో విద్యార్థులకు మెటీరియల్స్ పంపిణీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ) ప్రాంగణంలో, 10వ తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రాక్టీస్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి సబీహా పర్వీన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,“ఈ ప్రాక్టీస్ మెటీరియల్ను సమర్థవంతంగా వినియోగించుకొని రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి,” అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న హజ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి సూరి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ,ప్రభుత్వం మైనారిటీ విద్యార్థుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.‘‘సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్,మైనారిటీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రాక్టీస్ పేపర్లు చాలా ఉపయోగకరమైనవి. విద్యార్థులు ప్రతిరోజూ వీటిని అభ్యసించి తమ ప్రతిభను పెంపొందించుకోవాలి’’ అని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పుష్పరాజ్ సూచించారు. ఉపాధ్యాయులు శ్రీమతి థాహెరున్నిసా శ్రీమతి సలేహా బేగం శ్రీ అబ్దుల్ సుకుర్ శ్రీమతి ఈమ్రానా మాట్లాడుతూ,“ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంది. విద్యార్థులు మీకు అందించిన పాఠ్య సామగ్రిని పూర్తిగా ఉపయోగించుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలి,” అని సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనారిటీ వెల్ఫేర్ మంత్రి ఎన్.ఎం.డి. ఫారూఖ్ కి ఈ అధ్యయన సామగ్రిని అందించి మైనారిటీ విద్యార్థుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు తమ కృతజ్ఞతలను తెలియజేశారు.

