NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు మంచి బావిషత్ ఎంచుకోవాలి.. ఎమ్మెల్యే బుడ్డా

1 min read

మహానంది,  న్యూస్ నేడు : విద్యార్థులు తమ ఉజ్వల్‌ బావిషత్ కోసం బాగా చదువు కోవాలని శ్రీశైల నియోజక వర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్‌ కార్యక్రమాన్ని మహానంది మండలంలోని అన్ని పాఠశాలల్లో పండుగలా నిర్వ హించారు. అందులోభాగంగానే శుక్రవారం తిమ్మాపురం మోడల్ స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బావిషత్ మార్గదర్శకాలను రూపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయ సాధనలు నెరవేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసి కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని, ఎంపీడీవో మహబూబ్ దౌలా,ఎం ఈఓ సుబ్బరామయ్య, స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మణరావు, మండల పార్టీ కన్వీనర్ కంచర్ల శివశంకర్ చౌదరి, క్లస్టర్ ఇంచార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు,మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి,ఉమాదేవి, మహేశ్వర రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author