NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వతంత్ర దినోత్సవం వేడుకలో 20 మంది విద్యార్థులకు మెమెంటోలు

1 min read

ఎమ్మిగనూర్ ,న్యూస్ నేడు : ఎమ్మిగనూర్ పట్టణం శివ సర్కిల్ సమీపంలో గల టాపర్స్ నవోదయ కోచింగ్ సెంటర్ నందు డాక్టర్ బాలిక చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ వారు విద్యార్థిని విద్యార్థులకు నవోదయ ఎంట్రన్స్ ఉచిత పరీక్షలు నిర్వహించారు. నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 పురస్కరించుకొని గెలుపొందిన ఉత్తమ విద్యార్థిని విద్యార్థులకు 20 మందికి మెమెంటోలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ ఐ ఫ్రాంజ్ మరియు ప్రభుత్వ నోటరీ అండ్ అడ్వకేట్ మురళి కృష్ణ , విశ్వ హిందూ పరిషత్ మండల సెక్రెటరీ శ్రీ మాల మురళీకృష్ణ మరియు మాల మహానాడు మాల నరసన్న, టాపర్స్ హెడ్మాస్టర్ మరియు వ్యవస్థాపకులు శ్రీ రఫీ తో కలిసి డాక్టర్కి చంద్రశేఖర్ అందజేశారు. అలాగే జాతీయ పండుగ దినోత్సవం సందర్భంగా కొంతమంది విద్యార్థిని విద్యార్థులు దేశ నాయకుల వేషధారణతో ఔరా అనిపించుకునే విధంగా పౌరాణిక సంభాషణతో నటన చేస్తూ కనువిందు చేశారు. ఈ పూర్తి కార్యక్రమాన్ని టాపర్స్ నవోదయ కోచింగ్ సెంటర్ నందు డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ బారికి చంద్రశేఖర్ నిర్వహించారుబేస్ బాల్ లో నేషనల్ అవార్డు సాధించిన గొల్ల రాజేశ్వరి రాళ్లదొడ్డి అమ్మాయికి ఘనంగా సన్మానించారు.ఈ పూర్తి కార్యక్రమానికి పలువురు విద్యార్థి తల్లిదండ్రులు మరియు టాపర్స్ కోచింగ్ సెంటర్స్ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.

About Author