సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం..
1 min read

కూటమి నాయకులు
హొళగుంద న్యూస్ నేడు : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్ని నెరవేరుస్తుందని టీడీపీ కన్వీనర్ వీరన్న గౌడ్,టీడీపీ సీనియర్ నాయకులు పంపాపతి, ఎర్రి స్వామి,డి ఎస్ బాషా,అబ్దుల్ సుభాన్, సి బి ఎన్ ఆర్మీ మోయిన్, కూటమి నాయకులు అన్నారు. శుక్రవారం కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసిన సందర్భంగా స్థానిక బస్టాండు నందు ఆర్టిసి బస్సు కు పూజలు నిర్వహించి, మహిళలకు స్వీట్లు పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిందని, అధికారం చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని అన్నారు.ఇందులో భాగంగా శుక్రవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తుందని తెలిపారు.గత వైసిపి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఐదు సంవత్సరాలు కాలయాపన చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పంపాపతీ,ఈరప్ప, దిడ్డి వెంకటేష్, అబ్దుల్ రహిమాన్, సుబాన్,బిజెపి జనసేన నాయకులు ప్రసాద్,అశోక్,కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


