NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూక్ష్మ కళాకారుడి దంపతులు ఇల్లు లేని నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ

1 min read

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ( రిటైర్డ్ ) ఎన్. సంతోష్ హెగ్డే  ఆదేశం

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూర్ పట్టణంలో మిలటరీ కాలనీ నందు నివసిస్తున్న సూక్ష్మ కళాకారుడుని గుర్తించి డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించిన భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా రిటైర్డ్ అయిన ఎన్.  సంతోష్ హెగ్డే  ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ బస్టాండ్ ఆవరణలో స్వేద తీర్చుకుంటున్న ఇల్లు లేని నిరాశ్రయులైన అభాగ్యులకు చలి పులి నుంచి విముక్తి చెందేలా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయాలని డాక్టర్ బారికి చంద్రశేఖర్ ని ఆదేశించడం జరిగింది. కనుక ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలో సేద తీర్చుకుంటున్న నిరాశ్రయులైన వృద్ధులకు సూక్ష్మ కళాకారుడు దంపతులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 36 మంది నిరాశ్రయులైన వృద్ధులకు మరియు అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూక్ష్మ కళాకారుడు డాక్టర్ బారికి చంద్రశేఖర్ మరియు వారి శ్రీమతి హస్త కళాకారులను బెస్తా పార్వతి, నాగలదిన్నె నరసింహులు, నాగలదిన్నె లక్ష్మి, మాల చంద్రశేఖర్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author