ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రులు ఆనం,బీసీ..
1 min read

బనగానపల్లెకు మరో రాంకో సిమెంట్ కంపెనీకి కృషి
కొలిమిగుండ్ల శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ కార్యక్రమానికి మంత్రులు రాక..
బనగానపల్లె, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాకు వచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారంకొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మంత్రులు పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికిన ఆలయ నిర్వాహాకులు,పురోహితులు ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో మంత్రి ఆనం మరియు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఆనంతో పాటు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఇందిరమ్మ దంపతులకు వేదాశీర్వచనం అందించి,శ్వేత వస్త్రాలను పురోహితులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కో సిమెంట్ ఛైర్మన్ పీ.ఆర్ వెంకటరామ రాజ, బనగానపల్లె నియోజకవర్గం కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు,ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూకొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం అనికొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయం పునరుద్దరణకు ముందుకు వచ్చి సహకరించిన రామ్ కో సిమెంట్ యాజమాన్యం, ఛైర్మన్ పీ.ఆర్ వెంకటరామరాజాను మంత్రి బీసీ అభినందించారు. త్వరలో బనగానపల్లె నియోజకవర్గంలో మరో రామ్ కో సిమెంట్ కంపెనీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. తద్వారా బనగానపల్లె నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు తమ వంతుగా కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.

