NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వాన్ని దీవించండి..ఆశీర్వదించండి

1 min read

నీటి సమస్య తీర్చాలని ఎమ్మెల్యేకు మొర

ఖర్చు చేసిన బిల్లుల వివరాలు నాకివ్వండి

సీఎం సహాయ నిధి అందజేత..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : అవ్వా మీకేమైనా సమస్యలు ఉన్నాయా మీకందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటూ స్వయంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజలను అడిగి తెలుసుకున్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో బుధవారం ఉదయం”సుపరిపాలనలో తొలి అడుగు”అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని శ్రీ రామకృష్ణ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి తల్లికి వందనం,గ్యాస్ సబ్సిడీ నగదు  డబ్బులు వచ్చాయా అని మహిళలను అడిగారు.ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని అదేవిధంగా ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ కింద నగదును త్వరలోనే జమ చేస్తామని ఎమ్మెల్యే ప్రజలతో అన్నారు.మైనార్టీ మరియు వడ్డే కాలనీల్లో గత నాలుగు నెలలుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.పంచాయితీలో ఖర్చు చేసిన బిల్లుల వివరాలు నాకివ్వండిఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామానికి 5 లక్షల 72 వేల రూ.లు ఇస్తే ఇప్పుడు పంచాయతీ అకౌంట్లో 203 రూపాయలే ఉన్నాయని ఆ నగదును ఏ విధంగా ఖర్చు చేశారో వాటి బిల్లులతో సహా నాకు చూపించాలనిడిప్యూటీ ఎంపీడీఓ సంజన్న మరియు పీఎస్ శ్వేతను ఎమ్మెల్యే ఆదేశించారు.రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దీవించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రజలతో అన్నారు.తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి కింద జరపతి వెంకట లక్ష్మయ్యకు 24,041 రూ.ల చెక్కును వారి ఇంటికి వెళ్లి అందజేశారు.గ్రామ టీడీపీ నాయకులు రామేశ్వర్ రెడ్డి పొలంలో ఎమ్మెల్యే చెట్ల మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,ఇన్చార్జి ఎంపీడీఓ సురేష్ కుమార్, వంగాల శివరామిరెడ్డి,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,ఎస్ఐ ఓబులేష్,గ్రామ నాయకులు డి జయరాముడు,వెంకటేశ్వర్ రెడ్డి,మర్రి కుంట మహేశ్వర్ రెడ్డి,మీనిగ మహేశ్వర్ రెడ్డి,పుల్లారెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు.

About Author