NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గంగూరులో గ్రీన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్

1 min read

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్.

పెనమలూరు, న్యూస్​ నేడు: మండలం గంగూరు గ్రామంలో, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా పెనమలూరు నియోజకవర్గం లోని గంగూరు గ్రామంలో వ్యర్ధాలను కొనుగోలు చేసి నిత్యవసర సరుకులు ఇచ్చే గ్రీన్ షాప్ ని నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ నవీన్, సీఈవో జడ్పి అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుటకు అనేకమైన నూతన కార్యక్రమాల చేపడుతున్నారు అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాలు నుంచి ప్లాస్టిక్, కాళీ సీసాలు, ఇళ్లల్లో ఉపయోగించని వస్తువులను తీసుకొని దానికి అనుగుణంగా నిత్యవసర సరుకులు అందించే షాపులను ఏర్పాటు చేయటం ద్వారా ప్రజలకు ఉపయోగ తో పాటు, పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చని ఉద్దేశ్యముతో ఇటువంటి నూతన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రామాలలో యువత గ్రీన్ ఫీల్డ్ సోల్జర్స్ గా మారి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో ఉపయోగించే ఈ పద్ధతిని రాష్ట్రంలో అవలంబిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ షాపుని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, గంగోరి గ్రామంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద ప్రసాద్ బిసి సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు నేరుసురాజలక్ష్మి జంపాని వెంకటేశ్వరరావు తుమ్మలపల్లి హరికృష్ణ అక్బర్ బాషా ప్యారి లతీఫ్ అబ్దుల్ సలాం అబ్దుల్ గౌస్  కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *