NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుంకులమ్మ దేవాలయానికి రూ. 20 వేలు ఎమ్మెల్యే విరాళం

1 min read

భక్తి శ్రద్ధల మధ్య కార్యక్రమం నిర్వహణ – వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భారీ హాజరు

హోళగుంద న్యూస్ నేడు: కర్నూల్ జిల్లా హొళగుంద మండలం మర్లమడికి గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఊరు దేవర కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ దేవత అయిన శ్రీ సుంకులమ్మ అవ్వ దేవాలయానికి ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి రూ.20,000 విరాళంగా అందజేశారు. గ్రామ ప్రజల సంక్షేమం, ఆధ్యాత్మిక అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కొండా అమరేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని భక్తి పరవశంతో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *