NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ.32.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ స్పష్టం చేశారు. సోమవారం  పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, మద్దికేర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ.32 లక్షల 50 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ కె.ఈ. శ్యామ్ కుమార్ ఆయన క్యాంపు కార్యాలయంలో  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆపద సమయంలో కుటుంబానికి పెద్ద కొడుకుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించని సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందిస్తూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహకరించిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ కె.ఈ. శ్యామ్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *