NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్ అందించిన ఎమ్మెల్యే

1 min read

మిడుతూరు (నందికొట్కూరు)  న్యూస్​ నేడు : ప్రభుత్వం అందజేసే ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన దండుగల ఎల్ల నాగన్న (36)కు 40 వేల రూ.ల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే మరియు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి అల్లూరులో మాండ్ర శివానందరెడ్డి స్వగృహంలో శుక్రవారం ఉదయం చెక్కును తల్లి లక్ష్మీదేవికి అందజేశారు.ఎల్ల నాగన్న గత సంవత్సరం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి ఉండటం వల్ల వీటిని గమనించిన గ్రామ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు.ఈ నగదు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సహాయం నా అవసర సమయంలో గొప్ప తోడ్పాటుగా నిలిచిందని లబ్ధిదారుడు అన్నారు.ఈ కార్యక్రమంలో  గ్రామ నాయకులు డి.జయ రాముడు,కుంచ పుల్లారెడ్డి మీనిగ మహేశ్వర్ రెడ్డి, మర్రికుంట మహేశ్వర్ రెడ్డి, ఇడమ కంటి మురళీధర్ రెడ్డి పీరు సాహెబ్ పేట విజయ డైరీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గ్రామ కన్వీనర్,దేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

About Author