NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అత్యంత వైభవంగా,  “మెగా పేరెంట్స్ మీటింగ్” కార్యక్రమం

1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆస్పరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో  జరిగిన “మెగా పేరెంట్స్ మీటింగ్” కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి  ముఖ్య అతిథిగా హాజరై, బాలికల విద్య, వారి బంగారు భవిష్యత్తు గురించి విలువైన సందేశాన్ని అందించారు. ముఖ్య అంశాలు:తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాలికలు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థినుల ప్రగతి గురించి చర్చించారు.శ్రీమతి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ… విద్యార్థినుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రోత్సహించారు.పాఠశాల అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశం బాలికల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది.ఈ మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. తెలిపారు.

About Author