NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం పోరు పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రంలో  ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈనెల 12వ తేదీన ఆలూరు లో జరిగే  వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం పోరు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది .ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ.. హొళగుంద నుండి  ఢనపురం రోడ్డు అద్వానంగా ఉందని  ఇక్కడున్న ప్రజలు మరియు  ఆర్టీసీ డ్రైవర్లు  కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. నేను చాలా సార్లు అధికారులకు చెప్పిన , ధర్నాలు చేసిన, కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు . వైసీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మా నాయకుడు  వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పేదలకు మేలు జరిగే విధంగా 17 మెడికల్ కాలేజీలను  శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజ్ ను ప్రారంభించారు,మిగతా 12 మెడికల్ కాలేజీలు  80% పూర్తి అయ్యాయి, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను  ప్రైవేటీకరణ చేస్తుంది .పేదలకు మేలు జరగాలన్న  ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి, కానీ కుటమీ ప్రభుత్వం, ప్రైవేటీకరణ చేస్తూ టీడీపీ నాయకుల బినాములకు ఇస్తుంది .ప్రశాంతంగా ఉన్న ఆలూరు నియోజకవర్గని టీడీపీ ఇంచార్జ్  గొడవలు ప్రేరేపించాలని చూస్తున్నారు, గొడవలు సృష్టించకుండా  అభివృద్ధి చేసి చూపించాలన్నారు.టిడిపి నాయకులకు ఒకటే చెబుతున్న ఎప్పుడు కూడా ఒకే ప్రభుత్వం ఉండదని ఆలోచన చేయాలి అన్నారు, 12వ తేదీ  బుధవారం రోజున జరిగే వైస్సార్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీ కి పార్టీలకు అతీతంగా అందరూ రావాలని పిలుపునిచ్చారు.జడ్పీటీసీ లు,ఎంపీపీ లు, వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, విద్యార్థులు , వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​  అభిమానులు వైస్సార్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి భారీ ఎత్తున రావాలన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్ కో కన్వీనర్ లక్ష్మన్న, ఎం, షఫీ ఉల్లా జడ్పిటిసి శేషప్ప, ఎంపీటీసీ కంచప్ప మల్లికార్జున, ఎంపీపీ తనయుడు ఈసా, వైస్ ఎంపీపీ అనుమప్ప, సర్పంచ్ తనయుడు పంప,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే ,గిరి, ,నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు రామకృష్ణ కృష్ణయ్య, ఎం రహంతుల్లా, బీ తవాఫ్, ముద్దటమాగి షాషా, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author