NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉర్దూ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలి

1 min read

హొళగుంద న్యూస్ నేడు :  ఉర్దూ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపిఐ) నాయకులు తాసిల్దార్ నిజాముద్దీన్ నీ వినతి పత్రం అందజేశారు. సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపిఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలంలో ఎస్డీపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్  ఆధ్వరంలో తాసిల్దార్ నిజాముద్దీన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన అనంతరం అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ తెలుగు మరియు ఆంగ్ల భాషలతో పాటు ఉర్దూ భాషను కూడా ప్రభుత్వ లోగోలు, బోర్డులు, పేరు ఫలకాలు మరియు పత్రవ్యవహారాల్లో తప్పనిసరిగా వినియోగించాలని వారు కోరారు. ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించినప్పటికీ, చాలా కార్యాలయాల్లో అది కనిపించకపోవడం విచారకరం. ఇది రాజ్యాంగం కల్పించిన భాషా సమానత్వ సూత్రాలకు విరుద్ధం. రాష్ట్రంలోని లక్షలాది ఉర్దూ భాషాభిమానుల భావాలను గౌరవిస్తూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి” కోరారు.ఈ కార్యక్రమంలో  ఆలూరు అసెంబ్లీ కార్యదర్శి హఫీజ్ అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు షఫీ. మైపూజ్. వాజిద్ కైఫ్  తదితరులు పాల్గొన్నారు.

About Author