తుది దశకు కార్యాలయ సామాగ్రి తరలింపు
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కొత్త కార్యాలయం నుండి సేవలు ప్రారంభం
విలువైన సామగ్రి పర్యవేక్షణ బాధ్యత ఉద్యోగులకే..
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం కర్నూలు నగరపాలక సంస్థ నూతన కార్యాలయం నిర్మాణంలో భాగంగా ఎన్‌ఆర్ పేటలోని ప్రస్తుత కార్యాలయాన్ని తాత్కాలికంగా వెంకటరమణ కాలనీలోని ప్రైడ్ ప్లాజాకు తరలించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం పాత కార్యాలయం, తాత్కాలిక కార్యాలయాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం మంత్రి టీజీ భరత్ చొరవతో నూతన కార్యాలయ పనులు పునఃప్రారంభమయ్యాయని, రూ.28 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులు 50 శాతం పైగా పూర్తయ్యాయని తెలిపారు. మూడు అంతస్తులతో నిర్మాణం జరుగుతోందని, ప్రస్తుత కార్యాలయాన్ని నూతన భవనంలో ఒక అంతస్తులో ఉంచడం వీలు కాదని, పైగా అక్కడ మిగిలిన పనులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. ఏళ్ల నాటి దస్త్రాలను విభాగాల వారీగా తరలిస్తున్నామని, దాదాపు సామగ్రి మొత్తం తరలించామని, మరో రెండు రోజుల్లో పాత కార్యాలయం పూర్తిగా ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్న రాముడు, డిసిపి వెంకటరమణ, సూపరింటెండెంట్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

