గంబుజియా చేపలకి దోమలు పెట్టే లార్వాలు ఆహారం
1 min read
ఏలూరు పరిసర ప్రాంతాలలో గంబుజియా చేపలు విడుదల చేసిన డిఎం&హెచ్ ఓ యు.శోభ
పాల్గొన్న డాక్టర్లు,వైద్య సిబ్బంది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దోమల వృద్దిని అరికట్టుటలో గంబుజియా చేపలు కీలకంగా పని చేస్తాయని తద్వారా దోమల ద్వారా సంక్రమించే ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితరు వ్యాధులు అరికట్టుకోవచ్చని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్:యు. శోభ సూచించారు స్థానిక ఏలూరు తంగెళ్ళమూడి, వాణి నగర్, రాజరాజేశ్వరి నగర్, సపోటా తోట, ప్రగతి నగర్, భీమడోలు పాలసానిపల్లి వట్లూరు తదితర ప్రాంతాల్లో గంబుజియా చేపల విడుదల కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఈ సందర్భంగా జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్: యు.శోభ మాట్లాడుతూ మనిషికి ప్రకృతిలో లభించే వస్తువులు ఆహారం లాగే ఈ గంబుజియా చేపలకి దోమలు పెట్టే లార్వాలు ఆహారమని ఈ లార్వాలు తినడం వల్ల దోమల వ్యాప్తిని అరికట్టు కోవచని తద్వారా డెంగు మలేరియా,బోదకాలు, చికెన్ గునియా, మొదలగు వ్యాధులు తగ్గించుకోవచ్చని ఈరోజుఏలూరు జిల్లా లో అనేక ప్రాంతాలలో ఈ చేపల విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమల నివారణ పద్ధతులైన గంబూజియా చేపల విడుదల నీటి నిల్వ ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వదలడం, ఫ్రైడే డ్రై డే తదితర కార్యక్రములు నిర్వహించడం ద్వారా దోమలు నిర్ములన జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో , జిల్లా ఇన్వినైజేషన్ అధికారి డాక్టర్: పుల్లయ్య తాపీ మేస్త్రి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బీబీ జాన్,అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు హెల్త్ సూపర్వైజర్ కే. నిర్మల హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్ ఆరోగ్య కార్యకర్తలు సంధ్య, దీనకుమారి, ఆశా కార్యకర్తలు టి పద్మావతి, వై. రాజేశ్వరి ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


