NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లి పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పగింత

1 min read

కుటుంబ కలహలతో ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

కాపాడిన పోలీసులు

మంత్రాలయం  న్యూస్ నేడు :   కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో తుంగభద్ర నది లో దూకి ఆత్మహత్యాయత్నానికి నికి ప్రయత్నించిన వారిని పోలీసులు కాపాడి  కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మంత్రాలయం   ఎస్సై శివాంజులు తెలిపిన వివరాల మేరకు  ,కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన సౌమ్య తన  భర్త శివానందతో గొడవ పడి  పిల్లలు తీసుకొని బెంగళూరు నుండి ట్రైన్ ద్వారా తెల్లవారుజామున మంత్రాలయం కు వచ్చిందన్నారు.తుంగభద్ర నది దగ్గర ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బిడిది పోలీస్ స్టేషన్  ఇన్స్పెక్టర్ మంత్రాలయం  ఎస్ఐ శివాంజుల్  నాకు ఫోన్ చేయగా వెంటనే నేను ఆమె వివరములను వాట్సప్ ద్వారా తెలుసుకొని మా సిబ్బంది  అయినా రామకృష్ణ, నాగరాజు ను నది దగ్గర కు వెళ్ళి  గాలింపు చేయాలని ,  చెప్పడం జరిగిందన్నారు.  తుంగభద్ర నది పరిసర ప్రాంతంలో వారు గాలింపు చేపట్టిగ  ఎట్టకేలకు చనిపోవాలని నిర్ణయించుకున్న తల్లిని, పిల్లలను గుర్తించి నా దగ్గర  తీసుకువచ్చారు.  వెంటనే నేను బిడిది ఇన్స్పెక్టర్ మరియు ఆమె కుటుంబ సభ్యులకు  సమాచారం అందిచడం జరిగిందని , ఆమె కోసం అన్నలు సనత్ కుమార్,  సచిన్, రాహుల్ కు వారిని అప్పగించడం జరిగిందన్నారు.

About Author