ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి..
1 min read

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నవంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో రబ్బాని కాంప్లెక్స్ లో మంగళవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం సీజెఐ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా నవంబర్ 1వ తేదీన చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ కార్యక్రమానికి దళిత సోదరులు హాజరై కార్యక్రమాన్ని దళితులు విజయవంతం చేయాలని అన్నారు.దళితులు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా కుల రాకాసి వెంటాడుతూనే ఉందని అన్నారు. న్యాయస్థానం సిజెఐ పై దాడి జరిగిన ఇంతవరకు నేరస్తులను అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కనకం నాగరాజు,రాఘవ, నాగటూరు సుధాకర్,పరిమళ రాజు,మిడుతూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గద్దల ఆనంద్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

