సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
1 min read

ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ
బాల్యవివాహాల విముక్తి రథం, గోడ పత్రికలు ఆవిష్కరించని ఎంపి
నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నాం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పార్లమెంటు పరిధిలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. గురువారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసి, ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.పార్లమెంట్ పరిధిలో 56 స్మశానవాటికలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. అలాగే, రోడ్లు, రైళ్లు, ఆర్వోబీలు, కొత్త ప్రాజెక్టులు తేవటం, విద్యార్ధుల భవిష్యత్తు కోసం AI ల్యాబులు ఏర్పాటు చేయటం, ఆసుపత్రులకు కొత్త పరికరాలు, అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయటం వంటి పనులు చేస్తున్నామన్నారు. గ్రీవెన్స్ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలతో బుధవారం ఎంపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ (సి ఆర్ ఏ ఎఫ్)ఆధ్వర్యంలో బాల్యవివాహాల విముక్తురథం ఆవిష్కరించి బాల్యవివాహాల విముక్తి గోడ పత్రికలను ఎంపీ పుట్టా మహేష్ ఆవిష్కరించారు. బాల్యవివాహాo చట్టపరమైన నేరం, బాల్యవివాహాలు జరిపించడం తల్లిదండ్రులు కానీ, ఇతరులు కానీ దాన్ని ఎవరు ప్రోత్సహించవద్దని హితవు పలికారు. కార్యక్రమం ఐసిడిఎస్ పిడి పీ.పద్మావతి, ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సూర్య చక్రవేణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

