నాలుగవ రోజుకు చేరిన అంగన్వాడి రిలే దీక్షలు
1 min read

సిఐటియుతోనే సమస్యల పరిష్కారం. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి పద్మజ
న్యూస్ నేడు, పత్తికొండ: సీఐటీయూ తోనే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి పద్మజ స్పష్టం చేశారు. అంగన్వాడి వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా స్థానిక కోరమండల్ వద్ద అంగన్వాడి వర్కర్స్ చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరాయి. అంగన్వాడి వర్కర్స్ అండ్ పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి పద్మజ అంగన్వాడి హెల్పర్స్ కు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం 500 రూపాయలు జీతాలతో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియులో ద్వారా అనేక ఉద్యమాలు చేయడం వల్లనే జీతాలు 12000 రూపాయలు వివిధ డిమాండ్లను సాధించుకున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుతం అంగన్వాడి వర్కర్స్ కు 12 వేల రూపాయలకు, హెల్పర్స్ కు 7500 జీతాలు పెరిగాయని అన్నారు. ఈ ఐదు రోజుల్లో దీక్ష అనంతరం రెండో తారీకు విజయవాడలో జరిగే మహా ధర్నాకు అంగన్వాడీలు పూర్తిస్థాయిలో కదిలి మన డిమాండ్ల సాధనకై పోరాటం చేయవలసిందిగా ఆమె పిలుపునిచ్చారు. ఈ దీక్షలకు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు మద్దతు తెలుపగా హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు నాయకురాలు అంజనమ్మ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర అధ్యక్షులు గోపాల్ ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి రమేష్ మద్దికేర మండలం సిఐటియు కార్యదర్శి బురుజుల రాముడు తుగ్గలి.


