కర్నూల్,మద్దూర్ నగర్ తెలుగు తోటలో అలరించిన సంగీత విభావరి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కీర్తిశేషులు గాయకుడు మహమ్మద్ ,రఫీ, జ్ఞాపకార్థం, సింగర్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా, డి ,ఎస్ పి,మహబూబ్,బాషా, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు, పి, హనుమంతరావు చౌదరి, సింగర్ ఇబ్రహీం, చంద్రకంటి మద్దయ్య, రుక్మాంగద రెడ్డి,నాగేశ్వరరావు ,మరియు మహిళా కళాకారులు ఎంతోమంది మహమ్మద్ రఫీ అభిమానులు ప్రేక్షకులుపాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా, హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ కర్నూలు నగరంలో, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూల్ నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగరాన్ని హైటెక్ సిటీగా మార్చే దిశగా పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి కోసం ఇందులో,భాగంగా మద్దూర్నగర్ లోని తెలుగు తోట పార్కు ను అభివృద్ధి కోసం16 లక్షలు శాంక్షన్ చేసి ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు .ఈ తెలుగు తోట, కవులకు, కళాకారులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఆహ్లాదంగా అభివృద్ధి చేసినందుకు మంత్రి టీజీ భరత్ కి ప్రజలు కళాకారులు అభినందనలు తెలియజేశారు కర్నూల్ నగరం అభివృద్ధి జరగాలంటే,మంత్రి, టీజీ భరత్ కి, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని, రంగస్థలం కళాకారుడు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత పి,హనుమంతరావు చౌదరి కోరారు.


