ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
1 min read

ఈడిగ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు కు భారీగా తరలిన టీడీపీ నాయకులు
రాజేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, వంద బైకులతో ఆలూరుకు భారీ ర్యాలీ.
హోళగుందన్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు స్థానిక శ్రీ సిద్దేశ్వర రైస్ మిల్లు లో ఘ నంగా నిర్వహించినట్లు హొళగుంద టీడీపీ యువ నాయకుడు ఈడిగ రాజేంద్ర గౌడ్ శుక్రవారం తెలిపారు. వైకుంఠం జ్యోతి ఆదేశాలమేరకు టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో వంద బైకులతో ఆలూరుకు ర్యాలీగా వెళ్లినట్లు తెలిపారు.ఈ సందర్భంగా రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఆలూరు నియోజక అభివృద్ధి వైకుంఠం జ్యోతి తోనే సాధ్యం అని కొనియాడారు. నారా లోకేష్ పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, పసుపు జెండాలతో వంద బైకులతో ఆలూరుకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిక్కిలినేని అయ్యప్ప, వెంకట్ గిరి, దిడ్డి తిక్క స్వామి,ఈడిగ లక్ష్మీనారాయణ గౌడ్, మైనార్టీ నాయకుడు ఆదాం , ముస్లిం హోళగుందమండల అధ్యక్షుడు ముళ్ళమొయిన్ బోయ మల్లి,ఆలూరు వలి బాషా, టియన్ఎస్ఎఫ్ నాయకుడు మల్లి, బుడగజంగల రామాంజిని, సిద్దు,శాలి అమాన్, బకాడి వీరేష్,గజ్జెహళ్లి అలాం, దుర్గ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


