NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు 

1 min read

పత్తికొండ, న్యూస్ ​నేడు:   పత్తికొండ నియోజకవర్గo, తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పత్తికొండ పట్టణంలోని వృద్ధాశ్రమాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వృద్ధులకు ఆహారం అందించి, మానవతా విలువలు, సామాజిక బాధ్యత పట్ల తెలుగుదేశం పార్టీ నిబద్ధతను చాటారు.ఈ కార్యక్రమంలో నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివారెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్  రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తును దిశానిర్దేశం చేసే దూరదృష్టి గల యువ నాయకుడని కొనియాడారు. విద్య, ఉపాధి, ఐటీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో స్పష్టమైన విజన్‌తో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజల మధ్య ఉండి, ప్రజల సమస్యలపై పోరాడే రాజకీయమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, ఆ సిద్ధాంతానికి నారా లోకేష్  నాయకత్వమే ప్రతిరూపమని నాయకులు స్పష్టం చేశారు. యువత ఆశలు, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఎదుగుతున్న నారా లోకేష్ గారే రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసే భవిష్యత్తు నాయకుడని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author